Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తరువాత కుటుంబం ఒక మగాడిని మార్చేయగలదు అని ఆయన నిరూపించాడు. అల్లు స్నేహ రెడ్డి ప్రేమ.. అతడిని మార్చేసింది. ఇక పిల్లలు పుట్టాకా.. పూర్తిగా బన్నీ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే సినిమా.. లేకపోతే ఇల్లు. ముఖ్యంగా కూతురు అర్హ. అవే అతని ప్రపంచంగా మారిపోయాయి. ఇక అర్హ పుట్టినదగ్గరనుంచి యమా యాక్టివ్.. సోషల్ మీడియాలో అర్హకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. షూటింగ్ లేని సమయంలో బన్నీ.. తన ముద్దుల తనయ క్యూట్ క్యూట్ వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటాడు. అల్లు స్నేహ రెడ్డి అయితే.. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
IND vs PAK Live Updates: మళ్లీ వర్షం.. మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా
తాజాగా అల్లు బ్రదర్స్.. యువరాణితో ఆటలు ఆడుతున్న ఫోటోను షేర్ చేస్తూ లవ్ సింబల్ ను జతచేసింది. ఈ ఫొటోలో అల్లు అర్హ.. తండ్రి అల్లు అర్జున్ .. బాబాయ్ అల్లు శిరీష్ తో కలిసి జెంగా ఆడుతూ కనిపించింది. యువరాణి అలా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే.. అన్నదమ్ములు ఇద్దరు మురిసిపోతూ చూస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటి వైరల్ గా మారింది. ఇక ఈ అన్నదమ్ముల సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 తో బిజీగా ఉండగా.. అల్లు శిరీష్..బడ్డీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు . మరి ఈ రెండు సినిమాలతో ఈ అన్నదమ్ములు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.