Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆమె వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇక ప్రస్తుతం వరుణ్ కుటుంబం మొత్తం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండగా.. లావణ్య షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక వెబ్ సిరీస్.. మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఆ వెబ్ సిరీస్ నుంచి లావణ్యను తీసేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తివివరాల్లోకి వెళితే.. పులి మేక అనే వెబ్ సిరీస్ ద్వారా లావణ్య డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. దీని తరువాత లావణ్య స్కైలాబ్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన విశ్వక్ ఖండేరావు తో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అయ్యింది.
Bigg Boss Telugu 7: మొదటి ఎలిమినేషన్ లోనే హాట్ బ్యూటీ అవుట్.. ?
అధికారికంగా త్వరలోనే ఈ సిరీస్ ప్రకటన రానుంది. ముందుగా ప్రకటించకుండా లాంచింగ్ సమయంలో ప్రకటిస్తే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని అనుకోని ఇప్పటివరకు మేకర్స్ నోరు విప్పలేదట. ఇదొక రొమాంటిక్ వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ చాలా రొమాంటిక్ గా ఉండాలట.. అంతేకాకుండా ఇంటిమేటెడ్ సీన్స్ కూడా ఉన్నాయని సమాచారం. దీంతో ఆ పాత్రకు లావణ్య కరెక్ట్ కాదని, ఇప్పుడామె మెగా కోడలు కావడం, త్వరలోనే ఆమె పెళ్లి ఉండడంతో.. ఇలాంటి సమయంలో రొమాంటిక్ సీన్స్ అంటే బాగోదని మేకర్స్ ఆమెను తప్పించే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.