Leading News Portal in Telugu

Thalaivar 171: లోకేష్ కి రజినీకాంత్ తో సినిమా చేయడం ఇష్టం లేదా?


సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో 600 కోట్లు రాబట్టి… తను ఎందుకు సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడో నిరూపించాడు. అయిదేళ్లుగా సరిగ్గా హిట్ అనేదే లేని రజినీకాంత్, ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేసి కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. కోలీవుడ్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా జైలర్ నిలిచింది. జైలర్ సినిమా జోష్ నుంచి తలైవర్ ఫ్యాన్స్ బయటకి రాకముందే #Thalaivar171 సినిమా అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, నెక్స్ట్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేస్తున్నాడు అంటూ సన్ పిక్చర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. అసలు ఎలాంటి హింట్ లేకుండా సడన్ ఈ సినిమా ఎందుకు అనౌన్స్ అయ్యిందా అనే డౌట్ కోలీవుడ్ వర్గాల్లో ఉంది.

రజినీకాంత్-లోకేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే అయినా ఇప్పటికిప్పుడు ఎందుకు అనౌన్స్ అయ్యింది అనేది తెలియట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ పై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోకేష్ కి అప్పుడే అనౌన్స్ చేయడం ఇష్టం లేదు, లియో రిలీజ్ తర్వాత అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ లో ఉన్నాడని కోలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న మాట. మామూలుగానే ఒక సినిమా తర్వాత సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్లి, కథపై వర్క్ చేసి బయటకి వస్తాడు. లియో సినిమాని కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ చేసిన లోకేష్, రిలీజ్ డేట్ ని మిస్ చేయకుండా అగ్రెసివ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని చేస్తున్నాడు. ఈ కారణంగానే రజినీ సినిమా అనౌన్స్మెంట్ కన్నా ముందు కాస్త గ్యాప్ తీసుకోవాలని లోకేష్ అనుకోని ఉంటాడు. ఈ కారణంగానే లోకేష్ అప్సెట్ అయి ఉంటాడు అంతేకానీ రజినీకాంత్ తో సినిమా చేయకపోవడం అనే మ్యాటర్ ఉండకపోవచ్చు.