NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు హీటేక్కిస్తున్న వేళ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ? అంటూ అందరు ఆయన కోసం వెతుకుతున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. ఎప్పటినుంచో ఎన్టీఆర్ .. దేవర షూటింగ్ ను సైలెంట్ గా ఫినిష్ చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తరువాత దేవరతో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
Abhinav Gomatam: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమెడియన్..
ఇక ఇంకోపక్క లీకుల బెడద ఎక్కువ కావడంతో సినిమాను చాలా జాగ్రత్తగా తీస్తున్నారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ ఫినిష్ చేస్తున్నారట. అందుకే సౌండ్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారట. ఇక ఈ మధ్యనే షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్.. మళ్లీ రీ స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను ఫినిష్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్..ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.