Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే.. దాదాపు రూ. 574 కోట్ల వసూళ్లు సాధించి షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ తండ్రీకొడుకులుగా కనిపించాడు. దీపికా పదుకొనే, సంజయ్ దత్ క్యామియోలో కనిపించగా .. విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు. సినిమా సౌత్ వారికి అట్లీ సినిమాలను మిక్స్ చేసి ఇచ్చినట్లు అనిపించగా .. నార్త్ వారికి మాత్రం ఫుల్ మీల్స్ అందించాడని చెప్పుకొచ్చారు. ఇక అన్ని సినిమాలు మిక్స్ చేసినా కూడా షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్ వాటిని అన్నింటిని పటాపంచలు చేసేసింది. ఇంతకూ ముందెన్నడూ చూడని షారుఖ్ ను అట్లీ సౌత్ వారికి పరిచయం చేశాడు. దీంతో బాద్షా.. బాక్సాఫీస్ ను ఏలేస్తున్నాడు.
NTR: ఎటువంటి సౌండ్ లేకుండా ఆ పని చేసేస్తున్న ఎన్టీఆర్..?
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం జవాన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. దాదాపు రూ. 250 కోట్లు భారీ మొత్తం ఇచ్చి జవాన్ ను సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి భారీ హిట్ ను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందంటే.. పండగే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. థియేటర్ లో రచ్చ చేసిన జవాన్.. ఓటిటీలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.