Leading News Portal in Telugu

Pawan Kalyan: బ్రేకింగ్.. రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?


Pawan Kalyan to Meet Chandrababu in Rajahmundry Central jail: ఏపీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు రాజమండ్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పడానికి జనసేనాని వెళుతున్నారని సమాచారం. ఇక ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో ములాఖాత్ కానున్నారని అంటున్నారు. చంద్రబాబుతో బాబు ములాఖత్ కు సంబంధించి ఇప్పటికే జైలు అధికారులకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది.

Ashwini Dutt: చంద్రబాబు అరెస్ట్.. ప్రభాస్ నిర్మాత శాపనార్ధాలు!

చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈరోజు నాలుగు గంటలకు బాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూద్రా జైలులో ములాఖత్ కానున్నారు. మరోపక్క రాజమండ్రిలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ సమావేశం కాగా యువగళం బస్సు నుంచి బయటకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మిణి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఇక ఇంకో పక్క తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో నారా చంద్రబాబు కోసం గ్రామస్తులు గత మూడు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా చంద్రబాబు క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు, ఆయన బంధువులు చండీ హోమం చేపట్టారని తెలుస్తోంది.