Thori Bori Lyrical Video from Chandramukhi 2 Released: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ రిలీజ్ కి రెడీ అయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ సినిమాను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు.
Poonam kaur: జైల్లో చంద్రబాబు..అది గుర్తు చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్!
రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లగా హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో అలరించనుందని స్పష్టమైంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ అందమైన పాటను రిలీజ్ చేశారు. తొరి బొరి అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ పాటను భువనచంద్ర రచించగా అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఇక ఎం ఎం కీరవాణి వినసొంపైన బాణీ అందరినీ మెప్పిస్తోంది. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.