Leading News Portal in Telugu

HanuMan : ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..


టాలీవుడ్ యంగ్ హీరో ‘తేజ సజ్జ’ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లో ‘హనుమంతుడి’ పాత్రని ఆధారంగా ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ వేసిన విషయం తెలిసిందే.టీజర్ తో నే ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునేందుకు మూవీ టీం గ్రాఫిక్స్ విషయంలో బాగా క్వాలిటీ మెయిన్‌టైన్ చేయాలని నిర్ణయించుకుందని సమాచారం.అందుకనే బెటర్ విఎఫ్ఎక్స్ వర్క్ తో వచ్చేందుకు సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు.. మూవీకి టీం ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు.

తాజాగా దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఈ వినాయక చవితి నుంచి హనుమాన్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడతామంటూ ప్రశాంత వర్మ ట్వీట్ చేయడం జరిగింది.. మరి వినాయక చవితి నాడు ఏం అప్డేట్ ప్లాన్ చేశారో చూడాలి. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సజ్జ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వినయ్ రాయి విలన్ పాత్ర చేస్తుంటే వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నల కిశోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీని విడుదల చేయనున్నారు మేకర్స్.. కాగా సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమాలు ఉన్నాయి.ఇంత గట్టి పోటీ తట్టుకొని హనుమాన్ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.