Leading News Portal in Telugu

Rashmi Gautam: స్కిన్ షో సనాతన ధర్మంలో భాగమా? అంటూ కౌంటర్.. రష్మి ఘాటు రిప్లై


Rashmi Gautam Twitter war with Anti Sanathana Dharma Activits:తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో మొదలైన సనాతన ధర్మం వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన మాటలను గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసింది. దీంతో చాలామంది రష్మీ ని ట్రోల్ చేస్తున్న క్రమంలో సనాతన ధర్మం గురించి ఆమె కూడా తగ్గకుండా కామెంట్లు చేస్తోంది. ఇక తాజాగా ఆమెకి ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు. ‘‘స్కిన్ షో, ఎక్స్‌పోజింగ్ చేయడం చేయడం కూడా సనాతన ధర్మమేనా?’’ అంటూ ‘బాయ్స్ హాస్టల్’ మూవీ గురించి ఓ నెటిజన్ రష్మీని ప్రశ్నించగా దానికి రష్మీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ‘‘వాదన గెలవలేనప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు’’ అని అతనిపై అసహనం వ్యక్తం చేసింది.

Avantika Mishra: ఓ మైగాడ్ అనిపిస్తున్న అవంతికా మిశ్రా అందాలు

అంతేకాక ఆమె మాట్లాడుతూ ఇది సంస్కృతిలో ఒక భాగం, మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు? దండయాత్రలు జరగడానికి ముందు మేము ఎలా దుస్తులు ధరించామో దయచేసి తెలుసుకోవాలని ఆమె రాసుకొచ్చారు. హిందూ బాలికలు ఎలా ధరించారు లేదా ఏమీ ధరించారు అనేది తెలుసుకోవాలని పేర్కొన్న ఆమె మేము ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేమని, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే అని చెప్పుకొచ్చింది. వాటికి హిందూ మతం లేదా సనాతన ధర్మంతో సంబంధం లేదు అని రష్మీ పేర్కొన్నారు. ఇక కొందరు ఆమెను టార్గెట్ చేస్తుంటే హిందూ మతం, సనాతన ధర్మం ఫాలో అయ్యేవారు రష్మీ రిప్లైకి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఓ పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్లతో చర్చల్లో పాల్గొనవద్దని కొందరు ఆమెకు సలహా ఇచ్చారు.