
Nandamuri Ramakrishna Fires on Ys Jagan over Chandrababu Arrest: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని దివంగత ఎన్టీఆర్ కుమారుడు, నారా భువనేశ్వరి సోదరుడు నందమూరి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి కిల్ డెవలప్మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని నందమూరి రామకృష్ణ విమర్శించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న నందమూరి రామకృష్ణ ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా కేసు పెట్టకూడదని కానిస్టేబుల్‌కి సైతం తెలుసు కానీ డీఐజీ స్థాయి అధికారికి తెలియకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి స్కాం లేదు, దానికి సంబంధించిన లావాదేవీలన్నీ క్లియర్‌గా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నా ఇంకా ఏదో ఉందని ఆరోపించడం సిగ్గుచేటన్నారు ఆయన.
Poonam kaur: జైల్లో చంద్రబాబు..అది గుర్తు చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్!
చంద్రబాబు అభివృద్ధి కోసం అధికారాన్ని వాడితే జగన్ రెడ్డి మాత్రం కక్ష సాధింపులకు మాత్రమే అధికారాన్ని వాడి వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కక్ష సాధింపు తప్ప జగన్ రెడ్డికి ఎలాంటి పరిపాలనా తెలియడం లేదని పేర్కొన్న అయన గతంలో విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు సమయంలో మా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలున్నాయని చెప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది స్కిల్ డెవలప్మెంట్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని భారీ ప్రచారం చేసుకోవడం వాస్తవం కాదా? అప్పుడు కనిపించని అవినీతి, ఎన్నికల సమయంలో కక్ష సాధింపు కోసం కనిపించిందా? అని రామకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తికి అవినీతి మరక అంటించాలనే మీ ప్రయత్నం సాధ్యం కాదన్న ఆయన ప్రజలతో కలిసి జగన్ రెడ్డి అరాచకాలు ఎదుర్కొంటామని అన్నారు.