గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ ని మెగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజులోనే చూపించిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేసారు. పవన్ ఫ్యాన్స్ దాదాపు 12 ఏళ్ల పాటు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం వెయిట్ చేసారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేసారు పవన్-హరీష్ శంకర్. అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ జనరేట్ చేసిన ఈ సినిమా కొన్ని రోజుల తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్’గా మారింది. ఎప్పుడైతే ఈ మూవీ ‘తెరి’ సినిమాకి రీమేక్ అనే విషయం బయటకి వచ్చిందో, అప్పటి నుంచి ఫ్యాన్స్ ఓపెన్ గానే హరీష్ ని విమర్శించడం మొదలయ్యింది. మాకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వద్దు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యూజ్ నెగటివ్ ట్రెండ్ ని కూడా చేసారు. తనని తమలో ఒకరిగా భావించే పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేయడం, సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడడంతో అప్పట్లో హరీష్ శంకర్ కూడా బాగా అప్సెట్ అయ్యాడు.
తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం ఇస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడ్డాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించినట్లు ఎవరూ చూపించలేరు అనే మాటని నిజం చేస్తూ గ్లిమ్ప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ నుంచి బయటకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫోటోస్ చూసినా అదే ఇంపాక్ట్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎన్ని డేట్స్ ఇచ్చాడో, ఎప్పుడు షూట్ చేస్తున్నారు అనేది తెలియదు కానీ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 40% షూటింగ్ అయిపోయిందని సమాచారం. ఇంత ఫాస్ట్ గా సినిమాని చేస్తున్న హరీష్ శంకర్… ఎలక్షన్స్ టైమ్ కి ఉస్తాద్ భగత్ సింగ్ ని బయటకి వదిలితే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వడంతో పాటు ఎన్నికలకి కూడా బాగా హెల్ప్ అవుతుంది.