Leading News Portal in Telugu

Rana Daggubati: రజినీ సినిమాలో రానా.. అదిరిపోయే కాంబో.. ?


Rana Daggubati: జైలర్ సినిమా హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేశాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా అధికారికంగా ప్రకటించప్పటినుంచి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతూ వస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో రజినీ తో పాటు ఒక కుర్ర హీరో నటించే అవకాశం ఉందని.. కీలకమైన పాత్ర కావడంతో ఒక స్టార్ హీరోను మేకర్స్ అప్రోచ్ అవుతున్నారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే మొదట న్యాచురల్ స్టార్ నాని.. రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నాని కొట్టిపడేశాడు.

Madhavi Latha: కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..

ఇక దీని తరువాత శర్వానంద్ ఆ లక్కీ ఛాన్స్ పట్టేశాడని వార్తలు వినిపించాయి. ఆల్మోస్ట్ శర్వానే ఫిక్స్ అయ్యినట్లు కూడా టాక్ నడిచింది. ఇక ఇప్పుడు శర్వా ప్లేస్ లో రానా వచ్చాడని తెలుస్తోంది. అయితే రానా వచ్చింది శర్వా ప్లేస్ లోనా.. ? లేక సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడా.. ? లేక క్యామియోలో నటిస్తున్నాడా.. ? అనేది క్లారిటీ లేదు. రానాకు క్యామియోలు, సపోర్టింగ్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు.. అందులోనూ పాన్ ఇండియా సినిమా.. రజినీకాంత్ సినిమా అంటే మాటలు కాదు.. దీంతో రానా సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రజినీ, రానా కాంబో నిజమైతే అదిరిపోతోంది అంటూ అభిమానులు చెప్పుకోసిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.