Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి వివాదం లేకుండా సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే.. నేడు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ వలన ఈ సినిమా పెద్ద వివాదంలోకి వెళ్ళింది. అసలు ఆ వివాదం ఏంటి అంటే.. నిర్మాత అభిషేక్ నామా.. డైరెక్టర్ నవీన్ పేరును తీసేసి ఆ స్థానంలో ఆయన పేరు వేసుకున్నాడు. అంటే నవీన్ ను సినిమా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇలా డైరెక్టర్ ను తొలగించి సినిమా తీసినవారు చాలామంది ఉన్నారు. ఆ డైరెక్టర్ ప్లేస్ లో మరో డైరెక్టర్ ను పెట్టి .. సినిమా మొదటినుంచి తీస్తారు. కానీ, ఇక్కడ అలాకాకుండా నవీన్ మూడేళ్ళ కష్టాన్ని .. చివర్లో అభిషేక్ కొట్టేశాడని సమాచారం.
ఇక ఈ వివాదంపై నవీన్ సన్నహితులు ఏమంటున్నారంటే.. ” సిన్ అనే సినిమా నచ్చి.. అభిషేక్.. నవీన్ కు ఛాన్స్ ఇచ్చాడు. అలా డెవిల్ మొదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం .. భారీ ప్రశంసలు రావడంతో కళ్యాణ్ రామ్ హ్యాపీ. ఇక అభిషేక్.. రైటర్ శ్రీకాంత్ విస్సా కథ మెచ్చడంతో .. నవీన్ కు స్క్రీన్ ప్లే- డైరెక్షన్ ఇచ్చేద్దామనుకున్నాడు. ఆలాగే ఇచ్చాడు కూడా.. అక్కడే నవీన్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఉన్నా కొద్దీ అభిషేక్ .. నవీన్ ను వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఎలాగోలా సినిమాను పూర్తిచేశాడు. ఇక ఈ లోగా ఒక ప్రొడ్యూసర్ నవీన్ కి కోటి రూపాయిల అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా డబ్బులు ఇవ్వడంతో.. అందులో సగం ఇవ్వాలని నవీన్ కు ఒత్తిడి పెంచాడు అభిషేక్.. దీంతో నవీన్ ఏమి చేయలేక అభిషేక్ కు ఎదురుతిరగడంతో.. అభిషేక్.. ఇలా పగ తీర్చుకున్నాడని” చెప్పుకొస్తున్నారు.
ఇక ఇదంతా జరుగుతున్నా.. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఏం చేస్తున్నాడు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే మొదట కళ్యాణ్ రామ్ సైతం.. అభిషేక్ తో మాట్లాడాడు అంట.. ఆ తరువాత ఈ వివాదం ఇంకా ముగియకపోవడంతో.. అనవసరమైన వివాదాల్లోకి పోకుండా.. కళ్యాణ్ రామ్ న్యూట్రల్ గా ఉండిపోయాడని తెలుస్తోంది. దీంతో ఆయన కూడా ఈ పరిస్థితిలో ఏమి చేయలేడని తెలుస్తోంది. ఏదిఏమైనా నవీన్ మూడేళ్ళ కష్టాన్ని ఇలా చేయడం పద్దతి కాదని నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ వివాదం ఎకక్డావరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.