Leading News Portal in Telugu

Navdeep: హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్న TSNAB పోలీసులు


గడిచిన 48 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ స్కాండల్ కలకలం రేపుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ మళ్లీ డ్రగ్స్ మత్తు చుట్టుకుంది. ప్రొడ్యూసర్, హీరో కూడా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్త బయటకి రావడంతో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశం అయ్యింది. నార్కోటిక్స్ బ్యూరో నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. డ్రగ్స్ వాడిన  నిందితులను రిమాండ్ కు తరలించే పనిలో ఉన్న పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్న నార్కోటిక్ పోలీసులు. పరారీలో ఉన్నాడు అని అందరూ అనుకున్న నవదీప్ నిన్న పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు.

వెంకటేష్ షాడో ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం గాలిస్తూనే… హైదరాబాద్ లోని పలు పబ్ ల పైనా నార్కోటిక్ పోలీసుల నిఘా ఉంచారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు డ్రగ్స్ వాడే వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల వెతుకుతున్నారు. గతంలో కే పి చౌదరి లిస్ట్ లోనూ మోడల్ శ్వేతా పేరు ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేట. కే పి చౌదరి లిస్ట్ తో పాటు గతంలో బెంగుళూరు డ్రగ్స్ కేస్ లోనూ కలహర్ రెడ్డి ఉంది.