Leading News Portal in Telugu

Gadar 2: పఠాన్-జవాన్ మధ్య నలిగిపోయిన గదర్ 2


కరోనా తర్వాత బాక్సాఫీస్ కష్టాలని ఫేస్ చేసిన బాలీవుడ్ కి 2023 బాగా కలిసొచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్లుగా సినిమా చేయని షారుఖ్ ఖాన్… పఠాన్ సినిమాతో హిట్ లోటుని మాత్రమే కాదు బాలీవుడ్ కష్టాలని కూడా పూర్తిగా తొలగించాడు. ఈ మూవీ 2023కి బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే జవాన్ సినిమా కలెక్షన్స్ నే బ్రేక్ చేసే రేంజులో గదర్ 2 బయటకి వచ్చింది. ఈ మధ్య కాలంలో జెన్యూన్ గా ఒక బాలీవుడ్ సినిమా కేవలం నార్త్ లో మాత్రమే 600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం ఇదే మొదటిసారి. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరో, హీరోయిన్, కథతో తెరకెక్కిన గదర్ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండరు.

ఇక పఠాన్ సినిమా కలెక్షన్స్ ని గదర్ 2 బ్రేక్ చేస్తుందని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్న సమయంలో… గద్దర్ 2 ర్యాంపేజ్ కి బ్రేకులు వేసి… పఠాన్ రికార్డ్స్ ని కాపాడుకోవడానికి స్వయంగా షారుఖ్ ఖాన్ జవాన్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. జవాన్ సినిమా ఏ మాత్రం నెగటివ్ రిజల్ట్ ని రాబట్టినా కూడా ఈ పాటికి పఠాన్ రికార్డులు చెల్లాచెదురు అయ్యేవి. లక్కీగా జవాన్ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో గదర్ 2 స్పీడ్ కి బ్రేక్స్ పడ్డాయి. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో జవాన్ సినిమా హవా కొనసాగుతుంది. పఠాన్ వెయ్యి కోట్లు రాబడితే, గద్దర్ 2 675 కోట్లని రాబట్టింది… ఇక ఇప్పుడు జవాన్ సినిమా కేవలం 7 రోజుల్లోనే 700 కోట్లని కలెక్ట్ చేసి గదర్ 2ని సైలెంట్ చేసింది. అలా షారుఖ్ ఖాన్ తన రికార్డ్స్ తానే కాపాడుకోని మరోసారి తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో నిరూపించాడు.