Leading News Portal in Telugu

Gam Gam Ganesha Teaser: బేబీ హీరో.. ఈసారి కామెడీ చేసి నవ్విస్తాడంట..?


Gam Gam Ganesha Teaser: దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఆనంద్ కు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆనంద్ కు భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆనంద్ కు ఫ్యాన్స్ పెరిగారు. దీంతో చిన్న దేవరకొండ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం గం.. గం.. గణేశా. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది. హై లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Bigg Boss Telugu 7: రైతు బిడ్డను వాడుకున్నావ్.. వదిలేశావ్ .. ఇప్పుడు అతడిపై పడిందా రతికా.. నీ కన్ను..?

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” ఈ చెడు ప్రపంచంలో మంచిగా బ్రతకాలనుకోవడం ఒక చెడ్డ ఆలోచన” అని ఆటో డ్రైవర్ రాసిన కొటేషన్ తో టీజర్ మొదలయ్యింది. టీజర్ లో కథ మొత్తం రివీల్ చేయకపోయినా.. సినిమా మొత్తం కామెడీగా సాగుతుందని తెలుస్తోంది. డబ్బు కోసం ఆనంద్ దేవరకొండ ఒక డీల్ కోసం మాఫియాలోకి దిగడం కనిపిస్తుంది. అస్సలు ఈ కుర్రాడి కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.