Leading News Portal in Telugu

Gunturu Kaaram: షాకింగ్.. గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్..?


Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా వివాదాల మధ్య నడుస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమాపై ఎన్నో రూమర్స్ వస్తున్న విషయం విదితమే. మొదట్లో పూజ హెగ్డే వెళ్లిపోవడం, ఆ తర్వాత డీఓపీ మారడం లాంటివి సినిమాపై చాలా నిరాశను కలిగించాయి. దీంతో ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా..ఏ రూమర్ వచ్చిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Akkineni Naga Chaitanya: రెండో పెళ్ళికి సిద్దమైన నాగ చైతన్య.. వధువు ఎవరంటే..?

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ లీక్ అయ్యిందంటూ నెట్టింట పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. సగానికి పైగా ఉన్న ఈ ఆడియో సాంగ్ తమన్ మ్యూజిక్ తో ఉందని అంటున్నారు. థమన్ మాస్ బీట్స్ .. మహేష్ కు సరిపడే స్టార్ .. సూపర్ స్టార్ అనే లిరిక్స్ ఉండడంతో ఖచ్చితంగా గుంటూరుకారం లోనీదే ఈ సాంగ్ అని అంటున్నారు. అయితే మరికొందరు అది గుంటూరు కారం సినిమాకు సంబంధించిన సాంగ్ కాదని, ఈ మధ్యనే వాయిదా పడిన ఒక పాన్ ఇండియా సినిమా లోని సాంగ్ కు సంబంధించిన ఆడియో సాంగ్ అని చెప్పుకోస్తున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోగా ఆ పాన్ ఇండియా సినిమా ఏంటి అని ఇంకొందరు ఆరాలు తీస్తున్నారు. మరి వాయిదా పడిన ఆ సినిమా ఏంటో తెలియాల్సి ఉంది.