Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లిచేసుకొని నాలుగేళ్లు తిరగకుండానే విబేధాల వలన విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇక వీరి విడాకులు తీసుకొని రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా వీరి గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక గతేడాది నుంచి అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అందుకు నిదర్శనంగా వారిద్దరూ విదేశాలలో డేటింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. అయినా వీటిపై చై స్పందించింది లేదు. శోభితా మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఖరాకండీగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం చై.. కెరీర్ పై ఫోకస్ పెడుతున్నాడు. మరోపక్క నాగార్జున కూడా ఇద్దరు కొడుకుల జీవితాల గురించి చాలా డీప్ గా అలోచించి.. చివరికి చై విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
Prabhas: ప్రభాస్ ను పక్కనపెట్టుకొని.. హీరోయిన్ తో ఆ పని చేయించడం తగునా మారుతీ ..?
అదేంటంటే.. చైతన్యకు.. రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే.. సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెను.. కోడలిగా చేసుకోవడానికి సిద్దమయ్యారట. ఒకసారి ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై .. ఈసారి తండ్రి చెప్పిన మాటకు తలవంచి.. రెండో పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చై రెండో పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో చై అభిమానులు .. కంగ్రాట్స్ తెలుపుతున్నారు.