Leading News Portal in Telugu

Skanda: అభిమానమంటే ఇదీ.. కొడుక్కి రామ్ సినిమా పేరు పెట్టిన ఫ్యాన్


Ram Pothineni Fan fixes Skanda Name his to his Son: సినీ నటులను, రాజకీయ నాయకులను మన తెలుగు, తమిళ ప్రజలు అభిమానించే విధముగా ప్రపంచంలో ఇంకెక్కడా అభిమనించరు అంటే అతిశయోక్తి కాదు. తమిళులు ఏకంగా గుడులు కట్టేస్తే మన తెలుగు వారు తమ అభిమాన హీరోలు-హీరోయిన్ల పేర్లు తమ సంతానానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు అదే కోవలో రామ్ పోతినేని చేసిన పని ఒక హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో కీలకమైన సందీప్ అనే అభిమాని సాటి రామ్ అభిమాని అయిన హరిహర కొడుకు నామకరణ మహోత్సవానికి వెళ్ళాడు. అయితే అక్కడే కీలక అంశం అతనికి తెలిసింది. అదేమంటే హరిహర రామ్ అభిమాని కావడంతో అతని కుమారుడి పేరు ‘స్కంద’ అని పెట్టుకున్నాడు.

Sravana Bhargavi: విడాకులు లేకుండానే సింగర్ కి రెండో పెళ్లి చేసేస్తున్నారు!

అయితే ‘స్కంద’ సినిమా రామ్ హీరోగా రిలీజ్ కాబోతున్న తదుపరి సినిమా. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వాస్తవానికి సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడింది. సెప్టెంబర్ 28న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తన సాటి అభిమాని రామ్ రాబోతున్న సినిమా పేరు కొడుక్కి పెట్టడంతో సందీప్ తన ట్విట్టర్ లో పంచుకుంటూ హరిహర అనే రామ్ అభిమాని తన కుమారుడి పేరు ‘స్కంద’ గా నామకరణం చేసాడని రామ్ ను టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇక అది చూసిన రామ్ పోతినేని వెంటనే స్పందిస్తూ, ఈ చర్య నా మనసుకు చాలా హత్తుకుంది, ఆ పిల్లవాడికి స్కంద భగవానుడి యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని రాసుకొచ్చాడు. అలాగే ఆ అభిమాన్ని, అతని కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి అని ట్వీట్ చేశారు రామ్.