Leading News Portal in Telugu

Nithya Menen: ‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్ – ఎక్కడ, ఎందులో చూడాలంటే?


Nithya Menen Comedy Drama Series ‘Kumari Srimathi’ To Stream From September 28: ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటించిన నిత్యా మరో సిరీస్‌లో నటించగా ఆ సిరీస్ స్ట్రీమ్ అవడానికి సిద్ధమవుతోంది. నిత్య మీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది అనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా నిత్య కనిపించిన సినిమాలు, ఆమె పాత్రలు మాత్రం స్పెషల్‌ అనే చెప్పాలి. ఇక నిత్యామీనన్ చివరిగా తెలుగులో ‘భీమ్లా నాయక్’లో కనిపించింది. ఇక నిత్య మీనన్ నటించిన మూడు సిరీస్‌లు విడుదలయిన అమెజాన్ ప్రైమ్‌లోనే ఆమె నాలుగో సిరీస్ కూడా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. నిత్యామీనన్ ఇప్పటిదాకా రెండు హిందీ వెబ్ సిరీస్‌లు, ఒక తెలుగు సిరీస్‌లో నటించగా ఆ మూడు సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల అయ్యాయి. ఆమె అభిషేక్ బచ్చన్‌తో కలిసి చేసిన ‘బ్రీథ్ ఇంటూ ది షాడోస్’ వెబ్ సిరీస్ అయితే ఇప్పటికే రెండు సీజన్లుగా విడుదల అయి మంచి పేరు తెచ్చుకుంది.

Lavanya Tripathi: పెళ్ళికి ముందే వరుణ్ ఇంట లావణ్య..ఎందుకంటే?

ఇక నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి శ్రీమతి’ అనే కామెడీ వెబ్ సిరీస్ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. గోమ్టేష్ ఉపాధ్యే దర్శకత్వం వహించిన ‘కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అవుతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సిరీస్‌లో మొత్తంగా ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని, ఫుల్ మీల్స్ లా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సిరీస్ లో నిత్యా మీనన్‌తో పాటు నిరుపమ్, గౌతమీ, తిరువీర్, తాళ్లూరి రామేశ్వరి, నరేష్, మురళీ మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి ఎంటర్‌టైన్మెంట్స్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎర్లీ మాన్సూన్ టేల్స్.. ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‌ను నిర్మించింది.