Leading News Portal in Telugu

Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక


Niharika Konidela Birthday Wishes to Youtuber Nikhil Goes Viral: మెగా డాటర్ నిహారిక పెళ్లి, ఆ తరువాత విడాకుల వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతటి చర్చకు దారి తీశాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్దలు కుదిర్చిన నిహారిక చైతన్యల పెళ్లి బంధం రెండేళ్లు కూడా సరిగా సాగలేదు. కారణాలు ఏమిటో వారికే తెలియాలి కానీ ఇప్పుడైతే వారు మాజీలు అయిపోయారు. అయితే వీరి విడాకులు అయినట్టు అధికారికంగా ప్రకటన వచ్చిందో లేదో ఆమె మీద రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ఆమెకు వేరే వ్యక్తులతో లింకులు పెడుతూ కొందరు వార్తలు వండి వార్చారు. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తున్న నిఖిల్ అనే యూట్యూబర్ పేరుతో నిహారికను ట్రోల్ చేశారు. ఆ వార్తలకు నిహారిక ఎప్పుడూ స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం అప్పట్లో ఆ వార్తలను వైరల్ చేసిన వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి అలీతో సరదాగా షోకు కూడా వచ్చారు.

Jithendar Reddy: ఆసక్తి పెంచుతున్న ‘జితేందర్‌ రెడ్డి’ షార్ట్ వీడియో

కలిసి ఎంత సరదాగా ఉండేవాళ్లో, షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసే వాళ్లో చెప్పుకొచ్చారు. తాజాగా నిహారిక వేసిన పోస్ట్, నిఖిల్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చర్చనీయాంశం అయింది. తాజాగా నిఖిల్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక హోస్ట్ నుంచి.. కో యాక్టర్‌గా మారావ్, అక్కడి నుంచి ప్రొడ్యూసర్, ఇక ఆలా నా చిట్టి తమ్ముడిగా మారావ్, మనం ఎంతో ప్రయాణించాల్సి ఉంది అని అంటూ రాసుకొచ్చింది. ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్లు కొంత మందే ఉన్నారు, అందులో నువ్వు ఒకడివి.. లవ్ యూ నిక్కి.. నీకు అంతా మంచే జరగాలి.. హ్యాపీ బర్త్ డే నానా అంటూ నిహారిక పోస్ట్ చేసింది. దీంతో ఆమె గతంలో జరిగిన అన్ని ప్రచారాలకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చినట్టు అయింది. ఇక నిహారిక ఈమధ్యనే నాగబాబు, వరుణ్ తేజ్, తన తల్లితో వెకేషన్‌కి వెళ్లి తిరిగి వచ్చారు.
Niharika Nikhil