Leading News Portal in Telugu

Tiger Shroff: బాలయ్య… విజయ్… రవితేజ… శివన్నలకి పోటీ టైగర్ వస్తుంది


దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని మల్టీలాంగ్వేజస్ లో రిలీజ్ అవుతున్నవే. కర్ణాటకలో శివనా ఘోస్ట్… కోలీవుడ్ లో దళపతి విజయ్ లియో సినిమా బాక్సాఫీస్ ని పోటీ లేకుండా కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ఇక ఘోస్ట్, టైగర్ నాగేశ్వర రావు, లియో సినిమాల్లో ఏ మూవీ నార్త్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి పాన్ ఇండియా హిట్ అవుతుందో అని ట్రేడ్ వర్గాలు ఆలోచిస్తుంటే ఎవరూ ఊహించని విధంగా రేస్ లోకి వచ్చాడు టైగర్ ష్రాఫ్. యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే ఈ హీరో కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు.

టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 మేలో చేసిన లడాఖ్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘గణపత్’ సినిమా 2022 డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ పీసోత్ ప్రొడక్షన్ డిలే అయ్యి డైరెక్ట్ గా 2023 అక్టోబర్ కి వచ్చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాదిన్నర సమయం పట్టే అంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాని చేశారో లేక మరేదైనా కారణమా అనేది తెలియదు కానీ గణపత్ సినిమా పార్ట్ 1ని అక్టోబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో వినాయక చవితి రోజునే ఒక్క పోస్టర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గణపత్ సినిమా రిలీజ్ అవుతుండడం మన సినిమాలని ఓపెనింగ్ రోజున కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. అదే ఒకవేళ గణపత్ హిట్ అయితే మాత్రం లియో, టైగర్ నాగేశ్వర రావు, ఘోస్ట్ సినిమాలకి నార్త్ లో కష్టాలు తప్పవు.