Leading News Portal in Telugu

Martin Luther King: యోగిబాబు పాత్రలో సంపూ.. ‘సత్య’కి ఇచ్చి ఉంటే వేరే లెవల్ అంతే!


Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం నాడు విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సంపూర్ణేష్‌బాబు తల పై కిరీటం ఉండటం, అందులో కొంత మంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు డిఫరెంట్‌ గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎలిబీ శ్రీరామ్, నరేష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

RAM: దేశభక్తి చిత్రంగా రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్

ఈ సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఈ సినిమా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి సంపూర్ణేష్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం ఎందుకో అందుకోలేకపోయాడు. ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా కనిపిస్తున్న సంపూ కంటే ఈ పాత్రకు కమెడియన్ సత్యను తీసుకుని ఉంటే వేరే లెవల్లో ఉండేదని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఒకరకంగా యోగిబాబు, సత్య బాడీ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగానే ఉంటుంది. అలాగే ఇద్దరివీ చూడగానే నవ్వు తెప్పించే ముఖాలు. సంపూ కూడా మంచి నటుడే కానీ ఈ పాత్రకు కనుక సత్యని తీసుకుని ఉంటే వేరే లెవల్లో ఉండేదని అంటున్నారు.