Leading News Portal in Telugu

Rahul Sipligunj: రాహుల్-రతిక ప్రైవేటు ఫొటోలు లీక్.. సింగర్ సంచలన ఆరోపణలు


Rahul Sipligunj Sensational Allegation On Bigg Boss 7 Telugu Rathika Rose and Team: బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్లు అందరిలో రతిక ఎంట్రీ కాస్త వింతగా జరిగింది. ఎందుకంటే ఆమె ఎంట్రీ ఇచ్చే ముందు రోజు వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఎందుకంటే హీరోయిన్ రితికా నాయక్ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటుండగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇక అందరినీ షాక్ కి గురి చేస్తూ రతిక ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ అని ముందు ప్రచారం జరగ్గా దానికి తగ్గట్టుగా వారు క్లోజ్ గా ఉన్న కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అవి ఈ టైంలోనే ఎందుకు బయటకు వచ్చాయి అని అందరూ ఆలోచిస్తూ ఉండగానే రాహుల్ సిప్లిగంజ్ ఆమెపేరు ఎత్తకుండానే ఆమెను ఏకి పారేశాడు. ఆయన రెండు స్టోరీలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అందులో ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు? ఒరిజనల్‌ టాలెంట్‌ను బయటపెట్టాలని చూస్తారు కానీ కొంత మంది మాత్రం ఎప్పుడూ పక్క వారి పేరు, టాలెంట్ మీద బతకాలని చూస్తుంటారని అన్నారు. ఫేమ్ కోసం పేరును అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారని పేర్కొన్న రాహుల్ లోపల ఉన్న పర్సన్‌కి ఆల్ ది బెస్ట్.. పైసల్ తీసుకుని పని చేస్తున్న ఆమె టీంకు కంగ్రాట్స్ అని పేర్కొన్నాడు.

Manchu Lakshmi: సైమా అవార్డుల్లో వ్యక్తిపై చేయి చేసుకున్న మంచు లక్ష్మి..

ఆ తరువాత నాదొక ప్రశ్న అని మొదలు పెట్టి ఆరేళ్ల తరువాత ఆమె పర్సనల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి? లోపలికి వెళ్లే ముందు అవి బయటకు రావడం అంటే ఇదేమైనా ముందుగా ప్లాన్ చేసుకున్న పనేనా? మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీకే అర్థం అవుతుందని రాసుకొచ్చారు. నేను ఏ ఒక్కరి జీవితాలతో ఆడుకోలేదు.. సక్సెస్ కోసం ఎవరి కష్టాలు వాళ్లు పడుతుంటారని ఆయన అన్నారు. ఇలాంటి పని చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సింది, వారికంటూ ఓ కుటుంబం, లైఫ్ ఉంటుంది, వారి మీద ఇది ప్రభావం చూపిస్తుందని ఆలోచించాల్సిందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ గతం అనేది ఉంటది.. ఏం తెలియకుండా మీరు జడ్జ్ చేయకండి.. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి థాంక్స్.. నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకునే వారికి ఆల్ ది బెస్ట్ అని రాహుల్ రాసుకు రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇది రతిక గురించే అని చెప్పకపోయినా స్పష్టంగా ఆమె గురించే పోస్టులు పెట్టినట్టు అర్ధం అవుతోందని అంటున్నారు నెటిజన్లు.