38 Movies Releasing in Theatres indiawide on September 22nd: ఒకే రోజు ఏకంగా భారతదేశ వ్యాప్తంగా 38 సినిమాలు రిలీజ్ అవుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే అన్నీ ఒక భాషకు చెందిన సినిమాలు కాదు కానీ భారతదేశ వ్యాప్తంగా పలు భాషలకు చెందిన 38 సినిమాలు ఒకటే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే హిందీ నుంచి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో విక్కీ కౌశల్, మానుషి చిల్లర్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరొక పక్క శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సుఖీ అనే సినిమా రిలీజ్ అవుతుంది, దీనిని సోనాలి జోషి డైరెక్ట్ చేశారు. మరోపక్క సిద్ధార్థ గుప్తా, శివాని ఠాకూర్, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలలో స్వరూప్ గోష్ డైరెక్షన్లో ది పూర్వాంచల్ ఫైల్స్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే శ్రేయాశ్ తల్పడే, తనీషా ముఖర్జీ ప్రధాన పాత్రలలో రాజీవ్ డైరెక్ట్ చేసిన లవ్ యూ శంకర్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది.
Naveen Polishetty: జవాన్ తో రిలీజ్ అంటే నిద్రకూడా పట్టలేదు.. కానీ అద్భుతం జరిగింది: పోలిశెట్టి
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చీటర్ సినిమా, బాబా పిఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టదిగ్బంధనం సినిమా సత్య సాలాది దర్శకత్వంలో తెరకెక్కిన వారెవ్వా జతగాళ్ళు అనే సినిమాలతో పాటు పవన్ కడియాల డైరెక్షన్లో తెరకెక్కిన మట్టి కథ, రాము కోన డైరెక్షన్లో తెరకెక్కిన రుద్రం కోట సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి మరో కన్నడ హీరో నటించిన కలివీరుడు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు నచ్చిన వాడు, నెల్లూరు నెరజాన అనే సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి. ఇక తమిళంలో డెమోన్, ఆర్ యు ఓకే బేబీ, ఐమా, కడతారు, ఉలగమ్మాయి, కేజా పాయ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కన్నడ సినిమా విషయానికి వస్తే ఆరారోరారో, బన్ టీ, దిగ్విజయ, పరిశుద్ధం, ద్వంద, హనీమోన్ ఇన్ బ్యాంకాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మలయాళంలో లా టమాటింగ్ , వాతిల్, అక్కువింటే పడచోన్ , టోబీ, తెప్పోరి బెన్నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బెంగాలీ విషయానికి వస్తే పాలన్, కోతాయ్ తుంకో, ఓన్నో రుప్కత్, బ్యూటీ ఫుల్ లైఫ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక పంజాబీ నుంచి రబ్ ది మేహార్, గుజరాతీ నుంచి కహి డే నే ప్రేమ్ చే, గూమ్ అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.