Leading News Portal in Telugu

The Road Trailer: మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న త్రిష.. అదరగొట్టింది


The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇక గత కొంతకాలంగా త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వవిషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో త్రిష భారీ విజయాన్ని అందుకుంది. దీని తరువాత ఆమె రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష చేతిలో దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి. విజయ్ సరసన లియో సినిమాలో నటిస్తుండగా.. ది రోడ్ అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అరుణ్ వసీగరన్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని AAA సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి.. ఇలా చేయటానికి సిగ్గులేదు..?

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. NH 44 లో ఒక పర్టిక్యులర్ జోన్ లోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతుంది.. ఎవరు చేయిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి త్రిష రంగంలోకి దిగుతుంది. ఇక ఈ ప్రమాదాల వెనుక ఏదో రివెంజ్ దాగి ఉంది అని త్రిష కనుక్కుంటుంది. కానీ, ఆమెకు మాత్రమే ఈ ప్రమాదాలు కనిపించడం అనేది ట్విస్ట్ గా చూపించారు. అసలు ఆ రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏంటి.. ? ఈ ప్రమాదాల వెనుక ఉన్న వారు ఎవరు. .? అది సైన్సా ..? లేక ఏదైనా శాపమా.. ? ఏదైనా ఆత్మనా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక త్రిష కు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండి. చాలా సినిమాల్లో ఆమె మిస్టరీలను సాల్వ్ చేసే పోలీస్ గా, జర్నలిస్ట్ గా కనిపించింది. ఇక ఇందులో కూడా ఎప్పటిలానే తన పాత్రలో అదరగొట్టింది. మ్యూజిక్ సామ్ సీఎస్ హైలైట్ గా నిలిచింది. అక్టోబర్ 6 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో త్రిష ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.