Leading News Portal in Telugu

Ontari Gulabi: గణేష్ నవరాత్రి పందిళ్ళలో సీరియల్ తారల సందడి


Gemini Actors at Ganesh Pandals in Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Gemini Serial1
ఆసక్తికరమైన విషయం ఏంటంటే జెమినిలో సీరియల్స్ లో నటించే నటినటులు.. నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను స్వయంగా కలిసి వారితో ముచటించబోతున్నారు.
Gemini Serial2
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు సరూర్ నగర్ నవీ జీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను “ఒంటరి గులాబి” రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరో మరియు హీరోయిన్ గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు.