ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పెరిగిన అంచనాలకు మించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోయాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ రేంజ్లో ఉండాలి. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు బన్నీ. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ ‘స్పిరిట్’ అయ్యాక… సందీప్ రెడ్డి సినిమా స్టార్ట్ అవనుంది. అయితే ఈ లోపు ఓ తమిళ్ డైరెక్టర్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్… అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి స్టోరీ కూడా నరేట్ చేసినట్టు సమాచారం. జైలర్ తర్వాత నెల్సన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఉంటే బన్నీతోనే ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక వెయ్యి కోట్ల వైపు దూసుకుపోతున్న జవాన్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నాడు. కుదిరితే అట్లీతో కూడా బన్నీ సినిమా చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిరంగా మారింది. ఇద్దరు కూడా సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్సే కాబట్టి.. ఈ తమిళ తంబీలతో బన్నీ సినిమా చేస్తాడా? లేక ఈ వార్తలు రూమర్స్‌కే పరిమితమవుతాయో చూడాలి.