Leading News Portal in Telugu

Megastar Chiranjeevi: మిస్టరీ థ్రిల్లర్ మెగా ‘157’ టార్గెట్ ఫిక్స్…


మెగాస్టార్ నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ బయటికొస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నెక్స్ట్ అదే జరగబోతోంది. భోళా శంకర్ తర్వాత మెగా 156 చేయాల్సిన చిరు.. దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో చిరు త‌న వ‌య‌సు, ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌ చేస్తున్నట్టుగా డైరెక్టర్ చెబుతున్నాడు. మూడు లోకాల చుట్టూ తిరిగే కథ కావడంతో.. ముగ్గురు హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అనుష్క ఓ హీరోయిన్‌గా లాక్ అయిపోయిందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ… రొమాన్స్ లాంటివి ఉండవట.

జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి రేంజ్‌లో, ఈ జనరేషన్ పిల్ల‌లు కూడా మెగాస్టార్‌ను చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంద‌ని వ‌శిష్ఠ చెబుతున్నాడు. పక్కా ప్లానింగ్‌తో విజువల్ వండర్‌గా మెగా 157 ఉంటుందని అంటున్నారు. అంతేకాదు.. రిలీజ్ విషయంలోను టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి.. 2025 సంక్రాంతి లేదా సమ్మర్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు తగ్గట్టు షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారట కానీ దీనికంటే ముందే మెగా 156 ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. 157 ఫాంటసీ సినిమా కాబట్టి… విఎఫ్‌ఎక్స్ కోసం చాలా టైం పట్టనుంది కానీ కళ్యాణ్ కృష్ణ చేయబోయే మెగా 156 కమర్షియల్ మూవీ కాబట్టి… 2024లోనే రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే మెగా 157 ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.