Leading News Portal in Telugu

Chiranjeevi: చిరు న్యూ లుక్స్ అదుర్స్.. ఆ సినిమా కోసమేనా?


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు.. గత కొన్ని సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలకైనా భోళా శంకర్ సినిమా ప్లాఫ్ అవ్వడంతో పాటు విమర్శలను అందుకుంది.. దాంతో నెక్ట్స్ కు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కొత్త చిరంజీవి దర్శనమివ్వబోతున్నారు. ఇంతకీ ఏంటా మార్పులు అనే సందేహం మెగా అభిమానులకు కలుగుతుంది.. ఇమేజ్‌ పరంగా చిరంజీవికి ఢోకా లేదు.. ఆయనకు సరైన పాత్ర పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో వాల్తేరు వీరయ్య చూపించింది.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది..

అయితే మరీ కుర్రాడిలా కాకుండా వయసుకు తగ్గ పాత్రలో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. వశిష్ట అదే చేయబోతున్నారు. రజినీ జైలర్, కమల్ విక్రమ్‌ ఇండస్ట్రీ రికార్డులు కదిలించడానికి వాళ్ల అప్పియరెన్సే కారణం. గాడ్ ఫాదర్‌లో కాస్త అలా ట్రై చేసారు చిరంజీవి.. ఇక భోళా శంకర్ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో ఓ చేయాలనుకున్నా.. ప్రస్తుతానికి దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార ఫేమ్ వశిష్ఠ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకొచ్చారు చిరు. ఇందులో వింటేజ్ మెగాస్టార్ కనిపించబోతున్నారు… ఈ సినిమా డిఫరెంట్ లుక్ ను చూపించబోతున్నారు..

ఇకపోతే కంప్లీట్ ఇది ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ మూవీ కాబట్టి కథకు తగ్గట్లు సన్నివేశాలుంటాయని తేల్చేసారు వశిష్ట. ఇందులో అనుష్క శెట్టి దాదాపు హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిపోయినట్టే. స్వీటీతో పాటు ఐశ్వర్యా రాయ్, మృణాళ్ ఠాకూర్‌తోనూ చర్చలు జరుగుతున్నాయి.. ఈ మధ్య చిరంజీవి కాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మరో రెండు నెలల వరకు ఆయన కెమెరా ముందుకు రావడం కష్టమే. అన్నీ కుదిర్తే డిసెంబర్ నుంచి వశిష్ట సెట్స్‌పైకి రానుంది. ఈ ను యువీ క్రియేషన్స్ మెగా బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.. ఈ సినిమాతో చిరు హ్యాట్రిక్ హిట్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమాలో చిరు లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..