సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. విభిన్న చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడొక యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి వస్తోంది. ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా నిర్మాతలు ఈ సెన్సేషనల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. క్రేజీయెస్ట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మ్యాడ్ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
The most insanely fun and crazy gang is coming to meet you at theatres on 𝐎𝐂𝐓 𝟔𝐭𝐡 with MADdening entertainer. 😎#MADon6thOctober 🥳#MADtheMovie @kalyanshankar23 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin @gouripriyareddy… pic.twitter.com/bwpoM3Lw8z
— Naga Vamsi (@vamsi84) September 25, 2023