Leading News Portal in Telugu

Vasu Varma : డ్రగ్స్ కేసులో అరెస్టు ప్రచారం.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్


రీసెంట్ గా టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు మరియు పోలీసులు వరుసగా డ్రగ్స్ అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు..గతంలో నిర్మాత కెపి చౌదరిని అరెస్ట్ చేయడం జరిగింది.. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.అలాగే తాజాగా హీరో నవదీప్ కి కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు ఆరోపించారు.ఈ తరుణంలో నార్కోటిక్స్ అధికారులు మరియు పోలీసులు నాగ చైతన్య హీరోగా నటించిన ‘జోష్’ మూవీ డైరెక్టర్ వాసు వర్మ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినట్లు వరుసగా కథనాలు వెలువడ్డాయి.

దీనితో డైరెక్టర్ వాసు వర్మ స్వయంగా వీడియో బైట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘హాయ్ నా పేరు వాసు వర్మ జోష్ మూవీ డైరెక్టర్ ని. నిన్న మధ్యాహ్నం నుంచి నా పై కొన్ని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నేను అరెస్ట్ అయినట్లు నా ఫోటో పేరు వాడుతూ కొన్ని కథనాలు ప్రచురితమవుతున్నాయి.. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ కూడా అరెస్ట్ చేయలేదు.నేను మీ ముందే ఉన్నాను. ప్రస్తుతం నా వర్క్ తో నేను బిజీగా ఉన్నాను. అయితే ఈ వార్త ఎలా వచ్చింది అని ఆరా తీస్తే.. నా పేరుతోనే వాసు వర్మ అనే మరొకరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని తెలిసింది. దీనితో అదే పేరుతో వున్న ఆయన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. జోష్ డైరెక్టర్ అంటూ తప్పుగా ప్రచురించిన వారంతా తమ తప్పుని సరిచేసుకోవాలని వాసు వర్మ కోరారు. వాసు వర్మ డైరెక్టర్ గా జోష్ సినిమాతో పాటు నటుడు సునీల్ కృష్ణాష్టమి అనే సినిమాను కూడా తెరకెక్కించారు. అలాగే ఈ దర్శకుడు పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా అలాగే అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పని చేసారు.

https://www.facebook.com/watch/?v=286384150851132