Skanda: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బోయా సినిమా అంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో పొలిటికల్ పంచ్ లు ఏ రేంజ్ లో వాడతాడో అందరం చూసిందే. ఇప్పటికే బోయా ముందు సినిమాల్లో కూడా పొలిటికల్ పంచ్ లు పేల్చి .. థియేటర్ లో విజిల్స్ వేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇక స్కంద లో కూడా బోయపాటి పొలిటికల్ పంచ్ లు పేల్చాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులపై బోయపాటి.. తనదైన రీతిలో సెటైర్లు వేసాడని అభిమానులు అంటున్నారు.
Vijay Setupathi: ఆ సినిమాలో నటిస్తే.. కుటుంబంతో సహా చంపేస్తాం.. హీరోకు బెదిరింపులు
ట్రైలర్ ఓపెనింగ్ లోనే జైల్లో ఉన్న శ్రీకాంత్ ను చూపిస్తూ.. ఇంకోపక్క కోర్ట్ హాల్ ను చూపిస్తూ.. “పరిస్థితులకు తలవంచి మీరు తప్పు చేశారని ఒప్పుకోవచ్చు… ఆ చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మం ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోదు సార్..” అంటూ వాయిస్ ఓవర్ ఇచ్చిన తీరు.. ప్రస్తుత ఏపీ రాజకీయాలకు అద్దం పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇదొక్కటే కాకుండా.. ” మేము కోడిని, పొట్టేలునే కాదు.. మాకు ఎదురొస్తే దేన్నీ అయినా పచ్చడి పెడతాం.. జాడీ ఎక్కిస్తాం”.. రింగులోకి దిగితే రీ సౌండ్ రావాలే ..చుస్కుందం బరాబర్ చూస్కుందం”.. ఇలాంటి డైలాగ్స్ మొత్తం పొలిటికల్ పంచ్ లానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఒక రాజకీయ నేత గురించే.. కావాలని బోయపాటి ఈ డైలాగ్ పెట్టి ఉంటాడని టాక్ నడుస్తోంది. ఈ ఒక్క డైలాగ్ తో స్కంద ఇటు సినిమాపరంగా.. అటు రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు బజ్ లేని సినిమాకు .. ఈ ఒక్క డైలాగ్ పవర్ లా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ డైలాగ్ గురించే చర్చలు జరుపుతుంది. ట్రైలర్ లో ఈ డైలాగ్ ఒక్కటే ఉంది .. సినిమాలో ఇంతకు మించిన డైలాగ్స్ ఉన్నాయని మేకర్స్ హింట్ ఇచ్చినట్లే తెలుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి వివాదాలను సృష్టిస్తుందో చూడాలి.