
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హోంబాలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో బి ప్రభాస్ భారీ పరాజయాన్ని అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక సలార్ రిలీజ్ డేట్ ఒక పెద్ద మిస్టరీగా మారింది. మొదట నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతూనే వస్తుంది.
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహం.. తొలగించేస్తున్నాం.. బాహుబలి నిర్మాత ఫైర్
అన్ని సవ్యంగా జరిగి ఉంటే.. ఈపాటికి ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొని ఉండేవాడు. సెప్టెంబర్ 28 న సలార్ రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వలన సలార్ రిలీజ్ కావడం లేదని మేకర్స్ అధికారికంగా చెప్పారు. కొత్త డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు. అయితే ఆ కొత్త డేట్ ఈ ఏడాది ఉంటుందా.. ? వచ్చే ఏడాది ఉంటుందా.. ? అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ తెలిసింది. ప్రభాస్ .. ఈ ఏడాదే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడని సమాచారం . అవును .. సలార్.. ఈ ఏడాది డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డేట్ ను ఫైనల్ చేస్తున్నట్లు మేకర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు తెలిపినట్లు సమాచారం. ఇక దీంతో అభిమానులు పండగ మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట. ఇదే కనుక నిజమైతే.. ఈ ఏడాదే .. ప్రభాస్ ను మరోసారి వెండితెరపై చూడొచ్చు. మరి ఈ సినిమాతో ప్రభాస్ .. ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.