Leading News Portal in Telugu

Payal Rajput: నవంబర్ 17న మంగళవారం వస్తుంది…


ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ లో బ్యాక్ లెస్ గా న్యూడ్ గా కనిపించింది. పాయాల్ రాజ్ పుత్ ‘శైలజ’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విరుపాక్షకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇటీవలే రిలీజైన మంగళవారం టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో మేకింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చేసిన హైప్ ని మరింత పెంచుతూ ఇటీవలే “గణగణా మోగాలిరా” సాంగ్ బయటకి వచ్చి సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తో మంగళవారం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ఇప్పుడు మంగళవారం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇస్తూ అజయ్ భూపతి ట్వీట్ చేసాడు. నవంబర్ 17న మంగళవారం సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ తో మేకర్స్ వదిలిన పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. పాయల్ పల్లెటూరి అమ్మాయిలా సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ కనిపించింది. టీజర్, గణగణ మోగాలిరా సాంగ్ తో హైప్ క్రియేట్ చేసిన మంగళవారం సినిమా నవంబర్ 17న మంగళవారం రోజునే ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఎందుకంటే అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ ఉన్న ఫామ్ కి మంగళవారం సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ సినిమాతో పాయల్, అజయ్ భూపతి సాలిడ్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.