లైగర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని కసితో వర్క్ చేసిన విజయ్ దేవరకొండ ఊహించని ఫ్లాప్ ఫేస్ చేసాడు. ఖుషి సినిమాతో కంబ్యాక్ ఇద్దామనుకున్న విజయ్ దేవరకొండకి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దొరికింది కానీ ఏపీలో వచ్చిన నష్టాల కారణంగా పది కోట్ల లాస్ వచ్చింది. దీంతో ఖుషి సినిమా కూడా ఫ్లాప్ అయిన సినిమాల లిస్టులో చేరింది. గత అయిదేళ్లుగా హిట్ లేకుండా ఒక యంగ్ హీరో ఉంటే మార్కెట్ కంప్లీట్ గా క్లీన్ స్వీప్ అవుతుంది కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అలా జరగట్లేదు. విజయ్ మార్కెట్ ని ఫుల్ చేస్తూనే ఉన్నాడు, అతని క్రేజ్ కూడా పెరుగుతూనే ఉంది. డెస్పరేట్ హిట్ నీడ్ లో ఉన్న విజయ్ దేవరకొండ… కెరీర్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నట్లున్నాడు. ఇప్పటికే గౌతమ్ తిన్నునూరితో VD 12 సినిమా చేస్తున్న ఈ రౌడీ హీరో, గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ నుంచి మరో రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ రానున్నాయని సమాచారం.
టాక్సీవాలా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రాహుల్ సంకీర్తన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనుందట. మైత్రి మూవీ మేకర్స్ తో విజయ్ ఇప్పటికే డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాలు చేసాడు. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇప్పుడు విజయ్ దేవరకొండ మూడో సినిమా అనౌన్స్మెంట్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు దిల్ రాజు బ్యానర్ లో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు, ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని సమాచారం. ఇప్పటికే పరశురామ్-విజయ్ దేవరకొండ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు… ఆ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ తో ఇంకో సినిమా అనౌన్స్ చేయనున్నాడు. మరి ఈ నాలుగు సినిమాలతో విజయ్ పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చూడాలి.