Leading News Portal in Telugu

Trigger: ఆస్కార్స్ కి ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్


RP Patnaik’s Trigger Short film got qualification for the entry into “THE OSCARS”: ఒరిస్సాలో జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఇక ఆంధ్రా యూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టు విని సినిమా రంగంలో అడుగుపెట్టి 99లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చిత్రం’కు ఆర్పీతో బాణీలు కట్టించగా ఆ సినిమా ఘనవిజయంతో తేజ, ఆర్పీ పట్నాయక్ జోడీ యువతను అలరిస్తూ ముందుకు సాగింది. ఉత్తమ సంగీత దర్శకునిగా తన సత్తా చాటుకుంటూనే మాస్ ను విశేషంగా ఆకట్టుకునే బాణీలతో సందడి చేసిన ఆర్పీ 2004లో ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో నటుడిగా తెరపై కూడా కనిపించారు.

Nitya Menen: ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ

దర్శకుడు కావాలనే చిత్రసీమలో ప్రవేశించిన ఆర్పీ పట్నాయక్ 2008లో ‘అందమైన మనసులో’ సినిమాతో అభిలాష తీర్చుకుని “బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, అమి, తులసీదళం, మనలో ఒక్కడు” లాంటి సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఆయన హాలీవుడ్ లో చేసిన ఒక షార్ట్ ఫిలిం ఆస్కార్ రేసులోకి వెళ్లిందని ఆయన ప్రకటించారు. ‘’హాలీవుడ్‌లో నేను దర్శకత్వం వహించిన TRIGGER అనే షార్ట్ ఫిల్మ్‌ “THE OSCARS”లోకి ప్రవేశించడానికి అర్హత పొందిందని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నాను, దీన్ని సాధ్యం చేసిన నా నిర్మాతలు, వారి మద్దతుతో తారాగణం, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆయన రాసుకొచ్చారు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఆస్కార్స్ లోకి వెళ్లేందుకు బరిలోకి దిగడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.