ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించింది.ఈ సినిమా సెప్టెంబర్ 28 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా మూవీ యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 25) సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్ కంటే.. ఈ రిలీజ్ ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్సులు, రామ్ మాస్ లుక్ మరియు డైలాగ్స్ అదిరిపోయాయి. దీంతో స్కంద రిలీజ్ ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.స్కంద రిలీజ్ ట్రైలర్‌ను కరీంనగర్‌లో జరిగిన కల్ట్ జాతర ఈవెంట్‍లో సోమవారం రాత్రి రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మాస్ యాక్షన్ సీన్లతో, పవర్ ఫుల్ డైలాగ్‍లతో ట్రైలర్ అదిరిపోయింది.దీంతో స్కంద మూవీకి హైప్ మరింత పెరిగింది. కాగా, స్కంద తెలుగు రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్‍లో ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటేసింది. ట్రైలర్ వచ్చి 24 గంటలు గడవకముందే 10 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యూబ్‍లో టాప్‍లో ట్రెండ్ గా నిలిచింది.ఈ విషయాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ట్వీట్ చేసింది. “చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం. 10 మిలియన్ల రియల్ టైమ్స్ వ్యూస్ దాటి స్కంద తెలుగు ట్రైలర్ యూట్యూబ్‍లో టాప్ ట్రెండింగ్‍లో ఉంది” అని పోస్ట్ కూడా చేసింది.రామ్ పోతినేని చెప్పిన కొన్ని మాస్ డైలాగ్స్ ఈ రిలీజ్ ట్రైలర్లో హైలైట్ గా నిలిచాయి.. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సీన్లు కూడా దద్దరిల్లిపోయాయి. రామ్ కొత్త రస్టిక్ లుక్‍తో అదరగొట్టాడు.థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్‌కు హైప్ తెచ్చిపెట్టింది.. గతంలో వచ్చిన ట్రైలర్ కొందరికి అసంతృప్తి మిగిల్చినా.. ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం సినిమాపై హైప్‍ను పెంచేలా ఉంది