Vivek Agnihotri: బాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వివేక్ అగ్నిహోత్రి అనే పేరును చెప్పకు వచ్చేస్తారు అభిమానులు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే వివాదస్పదమైన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న వివేక్ అగ్నిహోత్రి.. ప్రస్తుతం వ్యాక్సిన్ వార్ అనే మరో వివాదాస్పదమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్నాడు ఈ డైరెక్టర్. సోషల్ మీడియాలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నో విమర్శలను అందుకున్నాడు. ముఖ్యంగా వివేక్..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై అనేక విమర్శలు చేసి నెట్టింట వైరల్ గా మారాడు. ప్రభాస్ కు అసలు యాక్టింగ్ రాదని, సలార్ టీజర్ చెత్తలా ఉందని ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అంతేకాకుండా సలార్ సినిమాకు ధీటుగా తన సినిమాను దింపుతాను అని ఇన్ డైరెక్టుగా కామెంట్స్ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత అతని గురించి తనేమీ మాట్లాడలేదు అంటూ కవర్ కూడా చేశాడు.
Mytri Movie Makers :సైలెంట్ గా సల్మాన్ తో సినిమా .. మైత్రి మూవీ మేకర్స్ మామూలోళ్ళు కాదుగా..
ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అతనిని వదలలేదని సమాచారం. మా హీరో పైనే ట్రోల్స్ చేస్తావా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా వివేక్ పై విరుచుకుపడ్డారట. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వివేక్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారని, తన కూతురుపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ప్రస్తుతం ఈ ట్రోల్స్ ను నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ప్రభాస్ గురించి తప్పుగా మాట్లాడడంతోనే వారు ఈ విధంగా చేశారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వివేక్ ఒక హీరో గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడాలని, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ తప్పవని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 28న ది వ్యాక్సిన్ వార్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ చిత్రంతో ఈ వివాదాస్పద డైరెక్టర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.