Leading News Portal in Telugu

Pedda Kapu Movie : విరాట్ కర్ణను అందుకే తీసుకున్నాం.. ‘పెద కాపు’ వయలెన్స్ కి అర్ధం ఉంది!


Miriyala Ravindar Reddy Interview on Pedda Kapu Movie: విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలు పంచుకున్నారు. . ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

మొదటి నుంచి పెద్దగా
పెదకాపు 1 టీజర్ ట్రైలర్ తో చాలా పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది కదా ఎలా అనిపిస్తుంది? పెదకాపు పై ఇంత మంచి బజ్ రావడం ఆనందంగా ఉంది, పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో మొదటి నుంచి పెద్దగా చేశాం. ఇది కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి, కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది.

నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి
పెదకాపు కథలో మీకు నచ్చిన అంశం ఏమిటి ? ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది, ఇందులో నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్ని తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి, సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు అంత పోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటకు వెళ్తున్నప్పుడు నిజమే కదా, మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది.

శ్రీకాంత్ అడ్డాల తెలుగు వెట్రిమారన్
సినిమా చాలా సహజత్వంతో ఉంటుంది, కుత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం, ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులను ప్రతిబింబిచేలా అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం, రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసి మరీ కొన్ని సహజమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. మరోసారి చెప్తున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు.

వెలైన్స్ కి కూడా ఒక కారణం ఉంది
ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా అనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు, ఈ పోరాటంలో చాలా సవాళ్లు వుంటాయి, ఇది రెండు పార్టులుగా చెప్పాల్సిన కథ. సెన్సార్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది, పెదకాపులో వైలెన్స్ వుంది, ఆ వెలైన్స్ కి కూడా ఒక కారణం ఉంది. సమాజంలో శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందే, ఆ యుద్ధం ఇందులో ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా ఏ కమ్యూనిటీ ప్రస్తావన వుండదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీని గురించి స్పష్టంగా చెప్పాను. పరిస్థితులు ఎలా మారిపోయినా సమాజంలో బలహీనుడు, బలవంతుడు.. ఎప్పుడూ ఉంటారు. ఒక సామాన్యుడు తన పరిస్థితులని తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం ఉండదు అదే ఈ సినిమా కథ.

పెదకాపు టైటిల్ పెట్టడానికి కారణం
మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం, ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరును చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ ఊరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు, అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం.

మీ ఇంటి నుంచి ఒక హీరోని పరిచయం చేయాలనే ఆలోచన మీకు ముందు నుంచి ఉందా ? ‘
విరాట్ కి సినిమాలపై ఆసక్తి ఉంది, తను హీరో మెటీరియల్, స్క్రీన్ పై చూస్తున్నపుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతి కలిగి, హీరోగా పరిచయం చేయొచ్చని నమ్మకం కుదిరింది. ఇది రెగ్యులర్ సినిమా కాదు, చాలా ఇంటెన్స్ తో వున్న యాక్షన్ సినిమా. దీనికి ఒక సామన్యుడు హీరో కావాలి, దీనికి విరాట్ సరిగ్గా సరిపోయాడు. కొత్త హీరోతో ఇంత పెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఐతే ఈ కథని బలంగా నమ్మాం.

శ్రీకాంత్ గారు నటిస్తానని చెప్పినపుడు ఫీలింగ్ ఏమిటి ?
నా మనసులో కూడా అదే వుంది, ఎందుకంటే కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు, దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు నటించారు. అనసూయ, తనికెళ్ళ భరణి, రావు రమేష్ పాత్రలు కూడా బలంగా వుంటాయి.