Leading News Portal in Telugu

Salman Khan: సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ నెలకు రెంట్ ఎంతో తెలుసా?


బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న హీరోలలో సల్మా్న్ ఒకరు. అలాగే భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఆయన ఒకరు. సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు..

తన లగ్జరీ అపార్ట్మెంట్ లలో ఒకడానిని అద్దెకు ఇవ్వాలని అనుకున్నాడు.. సోషల్ మీడియాలో అందుతున్న వార్తల ప్రకారం..సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. అద్దె ఒప్పందం ఆగస్టు నుండి 60 నెలల కాలవ్యవధికి సెట్ చేయబడింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను కలిగి ఉంటుంది.

నివేదికల ప్రకారం.. మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా. మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు ఆ తర్వాత పెరిగే అవకాశం ఉందని అంచనా.. సల్మాన్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆయన టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్టోబర్ 15 నుండి బిగ్ బాస్ 17 కి హోస్ట్‌గా కూడా కనిపించనున్నాడు..