Leading News Portal in Telugu

MAD Movie: జాతి రత్నాలు కంటే ఒక్కసారి తక్కువ నవ్వినా టిక్కెట్ డబ్బులు వాపస్


Naga Vamsi Interesting Comments on MAD Movie: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వచ్చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచి సెప్టెంబరు 26న ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు, ఇక ఈ పాట సందర్భానికి తగ్గట్టుగా గీత రచయిత భాస్కరబట్ల యూత్‌ఫుల్ మరియు రొమాంటిక్ లిరిక్స్ రాయగా వైరల్ అవుతోంది. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యాడ్ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

X : ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి రానున్న ఆడియో, వీడియో కాల్స్..

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ #MAD జాతిరత్నాలు సినిమా కన్నా ఒక్కసారన్నా తక్కువ నవ్వితే, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టినా డబ్బులు వెనక్కు ఇచ్చేస్తానని కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.