ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతిబాబు తరువాత కొంతకాలం సినిమాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విలన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. హీరోగా మెప్పించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తన లైఫ్ స్టాల్ మునపటి కన్నా పూర్తిగా మారిపోయిందన్న ఆయన ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు వెల్లడించారు. జీవితంలో హాయిగా ఉన్నామన్న ఫీలింగ్ రావాలంటే చివరి పదేళ్లు చాలా ముఖ్యమని జగపతి బాబు అన్నారు. ఆ కాలం చాలా విలువైనదిగా తాను భావిస్తానన్నారు.
జీవితాన్ని చాలా తృప్తిగా బతకాలన్న ఆయన తృప్తి వలన సంతోషం, సంతోషం వలన ఆరోగ్యం లభిస్తాయని తాను నమ్ముతానని వెల్లడించారు. మనసుకు, శరీరానికి శిక్షణ చాలా అవసరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సరైన శిక్షణ ఇస్తూ వెళ్లినప్పుడే ఆరెండూ మన మాట వింటాయని తెలిపారు. దీని ద్వారా ఒంటరి తనాన్ని తట్టుకునే శక్తి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు. తనకు మొదటి నుంచి దెయ్యాలు అంటే చాలా భయమని జగపతి బాబు తెలిపారు. అవి ఉన్నాయో లేవో తనకు తెలయదని అయినా కూడా అవి అంటే చాలా భయపడతానని చెప్పుకొచ్చారు. అలాగే ఇరుగ్గా ఉండే ప్రదేశాలంటే కూడా తనకి భయమని అలాంటి ప్రదేశాలకు వెళ్లనని కూడా తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా తన ఆలోచనలకు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. ఇక చనిపోయిన తరువాత ఏం జరుగుతుందనే ఆలోచన కూడా తనకు భయాన్నే కలిగిస్తుందని, చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా? బాధగా ఉంటుందా? అసలు అప్పుడు ఆనందాలు .. బాధలు తెలుస్తాయా? అనేది ఇప్పటికీ తనకు అంతుబట్టని విషయం అంటూ ఆయన నవ్వేశారు. ఇక తాజాగా సలార్ లో నటిస్తున్న జగపతి బాబు , తన కెరీర్ లోని బెస్ట్ క్యారెక్టర్స్ లో సలార్ లోని రాజమన్నార్ రోల్ ఒకటని అన్నారు. దాని ద్వారా మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.