Leading News Portal in Telugu

NTR: బావ నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే.. బామ్మర్ది ఏంటి ఇలా చెప్పుకొచ్చాడు


NTR: ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య తరుపు కుటుంబం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెల్సిందే . అప్పుడెప్పుడో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో నితిన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని చెప్పుకొచ్చారు. పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయినా కూడా దాని ఊసే లేదు. ఇక దాని గురించి పక్కన పెడితే .. మొదటి సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టడమే కాకుండా నితిన్ .. రిలీజ్ కూడా రెడీ చేశాడు. ఆ సినిమానే మ్యాడ్. నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా మీడియా తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బావ ఎన్టీఆర్ గురించి నితిన్ మాట్లాడాడు.

Maama Mascheendra Trailer: మామను చెడుగుడు ఆడడానికే పుట్టిన అల్లుళ్ల కథ ..

” ఎన్టీఆర్ లో ఏ విషయాలను మీరు ఆదర్శంగా తీసుకొని మీ నటనను కొనసాగిస్తున్నారు ” అన్న ప్రశ్నకు నితిన్ మాట్లాడుతూ .. ” బావనుంచి నేర్చుకోవడానికి ఏముంది.. అన్ని ఉన్నాయి.. నేర్చుకోవాలంటే ఆయన దగ్గరనుంచి ఒక పది నేర్చుకోవచ్చు. బావగారు దగ్గరనుంచి నేర్చుకోవాలి అంటే రోజుకు పది .. ఒక సంవత్సరం మొత్తం ఉన్నా కూడా ఇంకా మిగిలే ఉంటాయి. ఆయన డ్యాన్స్, నటన రెండు ఇష్టమే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నితిన్ కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడినట్లు కనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. నేర్చుకోవాలి .. నేర్చుకోవాలి అంటున్నాడే కానీ, ఏం నేర్చుకోవాలి అనేది క్లారిటీగా చెప్పడం లేదేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.