Leading News Portal in Telugu

Mansion 24: ఓంకార్ అన్నయ్య.. ప్యాంట్ తడిచేలా భయపెడతాడంట..?


Mansion 24: వన్ సెకన్.. ఏంటి.. మీలో కూడా ఓంకార్ అన్నయ్య పునాడా.. ? ఏంటి అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. వార్త ఓంకార్ అన్నయ్యకు సంబంధించింది కాబట్టి సింబాలిక్ గా ఉంటుంది అని .. అలా అన్నాం. ఓంకార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాయద్వీపం, ఛాలెంజ్, సిక్స్త్ సెన్స్ లాంటి షోస్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇక రాజు గారి గది అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. తమ్ముడు అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈసినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక దీని తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా రాజుగారి గది 2, రాజుగారి గది 3 అని మరో రెండు సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను అందివ్వలేకపోయాయి. ఇక తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చిన ఓంకార్ అన్నయ్య..ఈసారి డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తనకు అచ్చి వచ్చిన హర్రర్ నమ్ముకొని ఒక హర్రర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఆ సిరీస్ పేరు మ్యాన్షన్ 24.

Leo: బ్యాడ్ యాస్ మా.. లియో దాస్ మా.. సాంగ్ హిట్ అయితే సూపర్ అమ్మా

వరలక్ష్మీ శరత్ కుమార్, అవికా గోర్, రావు రమేష్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ కు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హర్రర్ కథలనే బాగా ఎంకరేజ్ చేస్తోంది. ఈ మధ్యనే అతిధి అనే హర్రర్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసారి మ్యాన్షన్ 24 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వరలక్ష్మీ, అవికా పోస్టర్స్ రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో అలరించాయి. ఇక తాజాగా రావు రమేష్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒంటి కన్ను తో ఉన్న రావు రమేష్ దీపం పట్టుకొని భయపడుతూ కనిపిస్తున్నాడు. మ్యాన్షన్ 24 అనే పురాతన భవనంలోకి వెళ్లిన వారు.. అక్కడ దెయ్యానికి బలి అయ్యారా.. ? లేదా.. ? అనేది కథగా తెలుస్తోంది. మరి ఈ సిరీస్ తో ప్యాంట్ తడిచేలా భయపెడతానని చెప్తున్నా ఓంకార్ నిజంగానే భయపెడతాడో లేదో చూడాలంటే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే.