Leading News Portal in Telugu

Virat Karrna: పెదకాపుపై ప్రభాస్ కన్ను పడేనా.. కుర్ర హీరో కోరిక తీరేనా.. ?


Virat Karrna: విరాట్ కర్ణ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు . పెదకాపు సినిమాత్ విరాట్ హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుఎపెట్టిన చిత్ర బృందం.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెట్టి.. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విరాట్.. విలేకరుల సమావేశంలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మీ మొదటి సినిమాకి శ్రీకాంత్ అడ్డాల గారు దర్శకుడు అన్నప్పుడు ఎలా అనిపించింది ? అన్న ప్రశ్నకు విరాట్ మాట్లాడుతూ.. “శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అన్నప్పుడు చాలా అనందంగా అనిపించింది. ఐతే నేను కొంచెం ఇంట్రోవర్ట్ ని. అంత త్వరగా ఏది బయటికి చెప్పను. మొదట్లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని దూరందూరంగా మాట్లాడేవాడిని. అయితే జర్నీ మొదలైన తర్వాత ఫ్రెండ్లీగా కలిసిపోయాం. ఫ్రెండ్లీ గా వుంటే అవుట్ పుట్ కూడా అద్భుతంగా వస్తుంది” అని చెప్పుకొచ్చాడు.

Vaani Kapoor: పిల్ల భలే.. దీని ఫిగర్ భలే..

ఇక సత్యానంద్ గారు ప్రభాస్ గారితో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపించింది? అన్న ప్రశ్నకు.. “ప్రభాస్ గారికి నేను డై హార్డ్ ఫ్యాన్ ని. చిన్నప్పటినుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నపుడు ప్రభాస్ గారిపై నాకున్న ఇష్టాన్ని ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పక్కన ఉంటూ వింటుంటాను. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సత్యానంద్ గారు ప్రభాస్ గారితో మాట్లాడినట్లు కూడా నాకు ముందుగా చెప్పలేదు. నేరుగా వేదికపై చెప్పేసరికి చాలా అనందంగా అనిపించింది. ఒక అభిమానిగా చాలా సంతోషపడ్డాను. సినిమా విజయం తర్వాత ఆయన నుంచి ఏదైనా స్పందన వస్తే ఫీలింగ్ వేరే లెవల్ లో వుంటుంది” అని చెప్పుకొచ్చాడు. సినిమా ఏదైనా సరే .. ప్రభాస్ కు నచ్చితే వారిని ప్రశంసించడంలో డార్లింగ్ ముందు ఉంటాడు. మరి ఈ సినిమాపై డార్లింగ్ కన్ను పడుతుందో లేదో చూడాలి.