Leading News Portal in Telugu

Skanda-Chandramukhi 2: అంచనాలను అందుకోని అడ్వాన్స్ బుకింగ్స్.. అదొక్కటే కాపాడాలి!


Bookings for Skanda Day 1 Chandramukhi 2 Day 1 are Not Upto Mark: బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘స్కంద’-ది ఎటాకర్ అనే సినిమా తెరకెక్కింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం కూడా మంచి హైప్ తీసుకొచ్చింది. స్కంద టీజర్, ట్రైలర్ లకి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుండగా తెలంగాణ బుకింగ్స్ మాత్రం ఆశించిన మేర కనిపించడం లేదు. రేపు గణేష్ నిమజ్జనం కూడా ఉండడంతో ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న చంద్రముఖి 2 కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది.

Agent OTT: అఖిల్ ఫాన్స్ కి బాడ్ న్యూస్.. ఏజెంట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై “స్టే”

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ కూడా తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల‌వుతుంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ వాయిదా పడడంతో ఈ రెండు సినిమాలు ఆ డేట్ ను చూసుకుని వాయిదా వేసుకున్నారు. అలా వాయిదా పడడం కూడా బుకింగ్స్ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇక సినిమాలు బాగుండి మౌత్ టాక్ కనుక బయటకు వస్తే తప్ప ఇప్పటికిప్పుడు బజ్ క్రియేట్ చేయడం కష్టమే. చూడాలి మరి ఏమవుతుందో?