లైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు లైగర్ సినిమాని డైరెక్ట్ చేసింది పూరిజగన్నాద్ యేనా అని షాక్ అయ్యారు. లైగర్ మూవీని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఒక డై హార్డ్ ఫ్యాన్… పూరికి ఒక లెటర్ రాశాడు. అందులో… నీకు చెప్పక్కర్లేదు, నువ్వు చూడని లో కాదు… కానీ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయని లో, నెక్స్ట్ టైం నీతో నువ్వు కొట్లాడి రా… బాకీ తీర్చేద్దువ్, ఉట్ జా సాలా అని రాశాడు. సీరియస్లీ స్పీకింగ్, పూరి మత్తు వదిలించుకోని సినిమాలు చేయాల్సిన సమయం వచ్చింది. once upon a time there lived a ghost అన్నట్లు, పూరి ఈజ్ ఏ ట్రూ ఫైటర్. అసలు నీ ఫిలాసపికి ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే, నీ హీరో మాట్లాడుతుంటే ఎవడైనా వినాల్సిందే, అలాంటిది హీరోకి నత్తి పెట్టి… డైలాగులు రాయకుండా నీ చేతులు నువ్వే నరికేసుకున్నావ్ పూరి.
నీ సినిమా అంటేనే, దీనెమ్మ.. హీరో ఆటిట్యూడ్ పీక్స్ లో ఉంటుంది. నీ హీరో మ్యానరిజమ్స్ ని ఎవ్వడైనా ఫాలో అవ్వాల్సిందే. శివమణి నాక్కొంచెం మెంటల్ అంటే, విజిల్స్ వేసాం. బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్ ని రిపీట్ మోడ్ లో విన్నాం. ఎప్పుడు వచ్చాం అని కాదన్నయ్య బులెట్ దిగిందా లేదా అంటే బాక్సాఫీస్ కే బుల్లెట్ దించాం. టిప్పర్ లారి వెళ్లి స్కూటర్ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటే థియేటర్ మోతమోగిపోయింది. నీ సినిమాలో లవ్ ట్రాక్స్ చూసి, ఇష్టపడిన అమ్మాయికి మా ప్రేమని భయం లేకుండా చెప్పే ధైర్యం వచ్చింది. బద్రి నుంచి నువ్వే రాసే కామెడి ట్రాక్స్ ని చూసి నవ్వుతూనే ఉన్నాం. ఈరోజుకి మాకు ఇడియట్ లో ఇసకబస్తాలు తీసుకెళ్లిన ఆలి గుర్తున్నాడు, బ్రహ్మి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుర్తున్నాడు… ఏమిరా బాలరాజు, ఏమిరా దేశానికి నీ వల్ల ఉపయోగం, పోనీ ఏదైనా పని చేసుకోరా అని తిట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తున్నారు.
నీ సినిమాల్లో హీరో హీరోయిన్లే కాదు బాసు, పక్కన ఉండే క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ విషయాన్ని చెప్పడానికి టెంపర్ లోని పోసాని క్యారెక్టర్, అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయిలో జయసుధ, ప్రకాష్ రాజ్ లని మించిన ఉదాహరణలు కావాలా చెప్పు? మరి ఈసారి ఏమైయింది లైగర్ సినిమాతో నీలో ఉన్న ఆ రైటర్ పెగ్ వేసి పడుకున్నాడు అంటావా? నీ స్పీడ్ ని, నీ రైటింగ్ ని, నీ మేకింగ్ ని… మ్యాచ్ కూడా చెయ్యలేక కొంతమంది సో కాల్డ్ పాన్ ఇండియా డైరెక్టర్లు కూడా వణికిపోతారు. అలాంటిది నువ్వు మూడేళ్ళు ఒక సినిమాని చేయడం ఏంటి మావా… లే ఇది నువ్వు కాదు, మాకు పాత పూరిని ఇవ్వు.
డబుల్ ఇస్మార్ట్‌తో బాక్సాఫీస్ బద్దలు చేసేయ్… ఆ వింటేజ్ పూరిని చూపించు, అలా పాత పూరీని చూపిస్తూ ఒక్క సినిమా అయినా చెయ్ మావా… చూసి కాలర్ ఎగరేసుకుంటూ ధియేటర్ నుంచి బయటకి వస్తా. నీ ఫ్యాన్ ని కదా, నీ స్టైల్ లోనే చెప్తా… అరేయ్ పూరి ఉట్ జా సాలే… నీకన్నా తోపు ఎవడు లేడిక్కడ. నీ టార్గెట్ హిట్ అయితే ఎయిమ్ ఫర్ ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా హిట్. నువ్వూ, నిన్ను ఇష్టపడే నేనూ… ఇద్దరం వార్ జోన్ లో ఉన్నాం. ఎక్ బార్, బస్ ఎక్ బార్, సబ్కీ వాట్ లగా దే… అగ్లే బార్ ధియేటర్ కే పాస్ మిలేంగే, హిట్ మారెంగే.. డబుల్ ఇస్మార్ట్‌తో పార్టీ కరేంగే… హ్యాపీ బర్త్ డే టూ యు అండ్ యువర్ ఫ్యాన్ మీ…