Leading News Portal in Telugu

Prakash Raj: సిద్దార్థ్.. క్షమించు.. వారి తరుపున నేను చెప్తున్నా


Prakash Raj:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండస్ట్రీ ఏదైనా కూడా ప్రకాష్ నటన గురించి తెలియని వారుండరు. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకై.. ఇక ఆయన నటన గురించి పక్కన పెడితే రాజకీయంగా ప్రకాష్ రాజ్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. ముఖ్యంగా బీజేపీని, మోడీని విమర్శించి మాట్లాడడంలో ప్రకాష్ రాజ్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఈ మధ్యనే చంద్రాయన్ 3 ప్రయోగంపై ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేసి వివాదాలను కొనితెచ్చుకున్నాడు. ఇక అది మరిచిపోకముందే తాజాగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. హీరో సిద్ధార్థ్ కు బెంగళూరులో అవమానం జరిగిన విషయం తెలిసిందే. చిత్తా అనే సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్ళిన సిద్ధార్థ్ ను కొంతమంది నిరసనకారులు అడ్డుకున్న విషయం విధితమే. కావేరి నదీ జలాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కర్ణాటక బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు.

Vijay Antony: ఏం గుండె అయ్యా నీది.. కూతురు చనిపోయిన వారానికే మరో కూతురితో

ఇక నిరసనకారులు అడ్డుకోవడంతో సిద్దార్థ్ అక్కడనుంచి నవ్వుతూ వెనుతిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ వీడియోపై ఫైర్ అయ్యాడు. సిద్దార్థ్ కు సారీ చెప్తూ ట్వీట్ చేశాడు. ” దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని పనికిమాలిన పార్లమెంటేరియన్లను ప్రశ్నించకుండా .. సామాన్యులను, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కన్నడిగుడిగా .. కన్నడిగుల తరపున సిద్దార్థ్ క్షమించు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.