Skanda BGM Became Hot Topic: రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా స్కంద. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడి ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే ఈ సినిమా పాటల విషయంలో థమన్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా తమ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాత్రం సరికొత్త చర్చ జరుగుతోంది.
Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్
ట్విట్టర్లో, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండే రాగడి అనే ఒక యూట్యూబర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాను పంజాగుట్ట పివిఆర్ లో వ్యాక్సిన్ వార్ సినిమా చూస్తుంటే మధ్యలో మ్యూజిక్ వినిపిస్తోందని ఎవరో ఫోన్ వాడుతున్నట్టు అనిపించి చాలా సేపు వెతికాను కానీ తర్వాత అర్థమైంది పక్క స్క్రీన్ నుంచి సౌండ్ లీక్ అవుతుందని అంతలా థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఉందని అంటూ కామెంట్లు చేశారు. ఇక స్కంద సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించిన ఈ దర్శకుడు మొరాకో మాఫియాను టచ్ చేస్తూ సీక్వెల్ తీయబోతున్నాడని వెల్లడించాడు. ఇక ఇలా సీక్వెల్స్ ట్రెండ్ లోకి బోయపాటి కూడా చేరినట్టయిందని చెప్పొచ్చు. ఇప్పటికే అఖండ పార్ట్-2 తీస్తానని ప్రకటించిన ఈ డైరక్టర్, స్కంద సినిమా చివర్లో ఏకంగా పార్ట్-2 పోస్టర్వదలడం గమనార్హం.